ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
దండేపల్లి, ఆంధ్రప్రభ: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని దండేపల్లి మండల కేంద్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ జెండాకు తెలంగాణ రాష్ట్ర గిరిజన ఆర్థిక అభివృద్ధి సంస్థ చైర్మన్ కోట్నాక తిరుపతి, లక్సెట్టిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు, ఆర్జీపీఎస్‌ఆర్ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి పూజలు నిర్వహించారు. అనంతరం జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ఆదివాసీల హక్కుల పరిరక్షణతో పాటు వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం, ఆదివాసీ సంఘాలు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆదివాసీ సంఘం జిల్లా నాయకుడు పెంద్రం శ్రీనివాస్, మండల అధ్యక్షుడు కోట్నాక జంగు, స్థానిక సర్పంచ్ అజ్మీర రాజేశ్వర్‌నాయక్, ఉప సర్పంచ్ సిరికొండ నవీన్, ఆదివాసీ నాయకులు మర్సుకొల్ల సంతోష్, కమాలకర్ తదితరులు పాల్గొన్నారు.
