కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికిన బీఆర్‌ఎస్ శ్రేణులు
రఘునాథపల్లి, ఆంధ్రప్రభ: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నల్లబెల్లి పర్యటనకు వెళ్తున్న సందర్భంగా రఘునాథపల్లి మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ఆదేశాల మేరకు మండలంలోని బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి కేసీఆర్‌కు స్వాగతం తెలిపారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వై. కుమార్‌గౌడ్, జనగామ వ్యవసాయ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్, మండల సమన్వయకర్త ముసిపట్ల విజయ్, మార్కెట్ మాజీ డైరెక్టర్ నూనెముంతల యాకస్వామిగౌడ్, జిల్లా యువజన నాయకులు లోకుంట్ల సృజన్‌కుమార్, వెల్ది ఉప సర్పంచ్ ఎడ్ల బాలరాజు, నాయకులు బండి కుమార్, బోయిని యాదగిరి, సమ్మయ్యతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
