Pulse Polio Drive | బోరబండలో పోలియో చుక్కలు వేసిన మంత్రులు

Pulse Polio Drive | బోరబండలో పోలియో చుక్కలు వేసిన మంత్రులు

● హైదరాబాద్‌ బోరబండ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కార్యక్రమ ప్రారంభం
● ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల సమక్షంలో చిన్నారులకు పోలియో చుక్కలు

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని బోరబండ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసి రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్ర‌భాక‌ర్‌, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్, ఆరోగ్య శాఖ కమిషనర్ సంగీత సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో)తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోలియో నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఒక్క చిన్నారి కూడా ఈ కార్యక్రమానికి దూరం కాకుండా తల్లిదండ్రులు సహకరించాలని అధికారులు కోరారు.