Kamareddy | రేపు అయ్యప్ప మహా పడిపూజ…

Kamareddy | రేపు అయ్యప్ప మహా పడిపూజ…
Kamareddy | కామారెడ్డి, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం అయ్యప్ప మహా పడిపూజ నిర్వహించడం జరుగుతుందని అయ్యప్ప గురు స్వామి ఇట్టెం సిద్ధిరాములు (Ittem Siddhiramulu) తెలిపారు. పట్టణంలోని ఈ ఎస్ ఆర్ గార్డెన్ లో ఉదయం 11 గంటలకు మహా పడిపూజ ప్రారంభం అవుతుందని చెప్పారు. అయ్యప్ప మాల ధరించిన స్వాములతో పాటు భక్తులు (devotees) పెద్ద ఎత్తున పడిపూజ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు. పడిపూజ అనంతరం అయ్యప్ప స్వాములతో పాటు భక్తులకు భిక్ష ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ అయ్యప్ప స్వామి ఆశీస్సులు పొందాలని ఈ సందర్భంగా సూచించారు.
