బీఎల్వోలు, బీఎల్ఏలతో జేసీ సమీక్ష

తిరుపతి కలెక్టరేట్, ఆంధ్రప్రభ : ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు బీఎల్వోలను ఆదేశించారు. ఆర్‌సీ రోడ్డు 1, 2వ స్వర్ణ వార్డు కార్యాలయంలో సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ శారదా దేవితో కలసి ఆర్‌సీ రోడ్డు 1, 2వ స్వర్ణ వార్డు కార్యాలయం పరిధిలోని 156, 157, 158, 159 పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన బీఎల్వోలు, బీఎల్ఏలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ డోర్ టు డోర్ ఎన్యుమరేషన్ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఎన్నిమరేషన్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని బీఎల్వోలను ఆదేశించారు.