తహసీల్దార్ ఆకస్మిక తనిఖీ

తహసీల్దార్ ఆకస్మిక తనిఖీ
కడెం, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కడెం మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ గ్రామంలో గల సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల బాలికల పాఠశాల, లింగాపూర్ గ్రామంలోని బీసీ బాలుర వసతి గృహం, మండల కేంద్రమైన కడెంలోని గిరిజన బాలుర ఆశ్రమ ప్రాథమిక ఉన్నత పాఠశాల, ఎస్సీ బాలుర వసతి గృహంలను కడెం మండల తహసిల్దార్ ఏం లచ్చిరాం, కడం ఎంఈఓ షేక్ హుస్సేన్, ఎంపీ ఓ శ్రీనివాస్ లు ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న విద్యాబోధన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల కిచెన్, శానిటేషన్ లను అధికారులు పరిశీలించారు. వారి వెంట గురుకుల పాఠశాల ఇన్చార్జి, ప్రిన్సిపాల్ అమీనా బేగం, వైస్ ప్రిన్సిపాల్ కళ్యాణి, స్థానిక హెచ్ డబ్ల్యూ ఓ లు రాంజీ, సృజన, ప్రకాష్ పాల్గొన్నారు.
