కేసముద్రంలో పోలీసుల కార్డన్ సెర్చ్..

కేసముద్రం, ఆంధ్రప్రభ : జిల్లా ఎస్పీ శబరిష్ ఆదేశాల మేరకు డీఎస్పీ తిరుపతి రావు ఆధ్వర్యంలో కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని 15, 16 వార్డుల్లో శనివారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఐ సత్యనారాయణ మాట్లాడుతూ, కార్డన్ సెర్చ్‌లో భాగంగా 2 క్వింటాళ్ల నల్ల బెల్లాన్ని స్వాధీనం చేసుకుని, 4,000 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసినట్లు తెలిపారు. అలాగే సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేయడంతో పాటు గంజాయి వినియోగం, అక్రమ రవాణాపై ఆరా తీసినట్లు చెప్పారు.

గుడుంబా తయారీకి పాల్పడుతున్న పలువురిపై కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. గంజాయి వినియోగం, అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం అందించిన వారికి రూ.5,000 నగదు బహుమతి అందజేస్తామని తెలిపారు. సమాచారం అందించేందుకు 87126 56999 సెల్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎస్సైలు క్రాంతికిరణ్, నరేశ్, కరుణాకర్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply