అమ్మవారికి వెండి బహుకరిస్తున్న భక్తులు తోట ప్రసాద్, శ్రీలత..

అమ్మవారికి వెండి బహుకరిస్తున్న భక్తులు తోట ప్రసాద్, శ్రీలత..
కరీమాబాద్, ఆంధ్రప్రభ : చారిత్రాత్మక మెట్ల బావి, శ్రీ ధన మైసమ్మ అమ్మవారికి భక్తులు తోట ప్రసాద్ శ్రీలత దంపతులు 100 గ్రాముల (10 తులాల) వెండి బహుకరించారు. ఉదయం 34వ డివిజన్ శివనగర్ శ్రీ ధన మైసమ్మ దేవాలయంలో అమ్మవారికి కవచం తయారీ కోసం ఆలయ అధ్యక్షుడు తోట బాబన్నకు 10 తులాల వెండినీ (23 వేల విలువ) అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షుడు తోటబాబన్న మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో శ్రీ ధన మైసమ్మ అమ్మవారు భక్తుల కొంగుబంగారమై విరాజిల్లుతున్నారని భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారు ప్రఖ్యాతి చెందినందున శివనగర్ కు చెందిన తోట ప్రసాద్ శ్రీలత దంపతులు వెండి బహకరించారని తెలిపారు. అనంతరం వారిని సన్మానించి అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి వెంకన్న, భక్తులు పాల్గొన్నారు.
