ప్రజా సమస్యల పరిష్కారానికి ‘ప్రజా దర్బార్’

ప్రజా సమస్యల పరిష్కారానికి ‘ప్రజా దర్బార్’

బుధవారం ఎన్డీఏ కార్యాలయం
పెన్షన్లు, రేషన్ కార్డులు, తాగునీటి సమస్యలపై వినతులు స్వీకరణ.
పాల్గొనున్న అధికారులు కూటమి నాయకులు..
ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి

భవానిపురం, ఆంధ్రప్రభ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసం ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) ఆదేశాల మేరకు ‘ప్రజా దర్బార్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన కార్యాలయం వెల్లడించింది. ఈ నెల 20వ తేదీ బుధవారం నుంచి భవానీపురంలోని ఎన్డీఏ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు పెన్షన్లు, రేషన్ కార్డులు, తాగునీటి సమస్యలు, ఇళ్ల స్థలాలు, వైద్య సహాయం తదితర అంశాలపై తమ ఫిర్యాదులు, వినతులను సమర్పించవచ్చని తెలిపారు.

ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే ఎన్డీఏ కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply