పుస్తక పఠనమే విద్యార్థుల విజ్ఞాన వికాసానికి బాట…

పుస్తక పఠనమే విద్యార్థుల విజ్ఞాన వికాసానికి బాట…

బాపట్ల, ఆంధ్రప్రభ : బాపట్ల శాఖా గ్రంథాలయంలో ఏప్రిల్ 28న ప్రారంభమైన వేసవి విజ్ఞాన శిక్షణ తరగతులు శనివారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి గ్రంథాలయ అధికారి ఎ. శివాజీ గణేషన్ అధ్యక్షత వహించగా, ఏ వి వి హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు యడ్ల సత్యవతి, ఇస్లాంపేట ఆజాద్ ఎంపిఎల్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు పురం. వెంకట సాంబశివరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

విద్యార్థుల్లో క్రమశిక్షణ, సృజనాత్మకత, పుస్తక పఠన అలవాటును పెంపొందించడంలో ఈ తరగతులు ఉపయోగపడ్డాయని వక్తలు పేర్కొన్నారు. సెల్‌ఫోన్ల వినియోగాన్ని తగ్గించి గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమం విజయవంతానికి సహకరించిన వారందరికీ గ్రంథాలయ అధికారి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply