Pawan kalyan | రిస్క్ చేయబోతున్నారా..?
Pawan kalyan | రిస్క్ చేయబోతున్నారా..?
Pawan kalyan | పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి సినిమా త్వరలో సెట్స్ పైకి
45 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలనే ప్లాన్
పవన్ కళ్యాణ్ రిస్క్ చేయబోతున్నారా?
ప్లాప్ డైరెక్టర్ దేవ కట్టాతో కొత్త ప్రాజెక్ట్ టాక్
బలమైన కథతో క్రేజీ కాంబో రాబోతుందా?
త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం
Pawan kalyan | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్.. తను ఎప్పుడో ఒప్పుకున్న ఈ మూడు సినిమాలను కంప్లీట్ చేసి రిలీజ్ (Release) చేసేసారు. ఇక సినిమా చేస్తానని మాట ఇచ్చిన ప్రాజెక్ట్ ఉంది. అదే.. సురేందర్ రెడ్డితో సినిమా. ఈ సినిమాని త్వరలో పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు మరో మూవీకి ఓకే చెప్పారని.. అది కూడా ప్లాప్ డైరెక్టర్ తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ.. ఎవరా ప్లాప్ డైరెక్టర్..? ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేది ఎప్పుడు..?

Pawan kalyan | త్వరలో సెట్స్ పైకి పవన్ – సురేందర్ రెడ్డి సినిమా
పవన్ కళ్యాణ్.. సురేందర్ రెడ్డి సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. పవన్ కళ్యాణ్.. ఉస్తాద్ భగత్ సింగ్ (Ustad Bhagat Singh) మూవీని 45 రోజుల్లో పూర్తి చేశారు. సురేందర్ రెడ్డితో చేసే సినిమాను కూడా 45 రోజుల్లోనే పూర్తి చేయాలని.. ఫిక్స్ అయ్యారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతుందని తెలిసింది. స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయి.. షూటింగ్ లోకేషన్స్ అన్నీ ఫైనల్ అయిన తర్వాత డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఎప్పుడు రెడీ అంటే.. ఇప్పుడు పవన్ డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్.

Pawan kalyan | పవన్ – దేవ కట్టా..
ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్ ప్లాప్ డైరెక్టర్ తో సినిమా (Movie) చేసేందుకు ఓకే చెప్పారని వార్తలు రావడం ఆసక్తిగా మారింది. ఎవరా ప్లాప్ డైరెక్టర్ అంటే.. దేవ కట్టా అని టాక్ వినిపిస్తోంది. అయితే.. ఆయన తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో కలెక్ట్ చేయకుండా ఫ్లాప్ అయ్యుండచ్చు. కానీ.. మంచి కథా బలం ఉన్న సినిమాలు తీస్తాడు అనే పేరుంది. ఆటో నగర్ సూర్య, రిపబ్లిక్ సినిమాలతో.. ఆయన ఐడియాలజీ ఏంటి అనేది క్లియర్ గా తెలుస్తుంది. వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించాలి అనే దేవ కట్టా శైలి నచ్చడం వలనే పవన్ కళ్యాణ్ సినిమా చేయడానికి ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. అయితే.. సురేందర్ రెడ్డితో సినిమా చేస్తూనే ఈ సినిమాని కూడా పట్టాలెక్కించాలి అనకుంటున్నారట పవర్ స్టార్. త్వరలో దేవ కట్టాతో సినిమా గురించి అనౌన్స్ చేస్తారని టాక్. ఇదే కనుక జరిగితే.. ఈ క్రేజీ కాంబోలో బలమైన కథతో సినిమా రావడం ఖాయం.

