జాతీయ జెండా రెప‌రెప‌లు

  • పాలమూరు రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య వేడుకలు
  • బీటెక్‌ విద్యార్థులకు రూ.55 వేల ఆర్థిక సాయం
  • పేద విద్యార్థుల చదువుకు అండగా నిలిచిన సేవా సమితి
  • జాతీయ జెండాను ఆవిష్కరించిన సంఘం ప్రతినిధులు

మహబూబ్‌నగర్‌ రూరల్‌, ఆంధ్రప్రభ : పాలమూరు రెడ్డి సేవా సమితి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాలమూరు రెడ్డి సేవా సమితి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా బీటెక్‌ చదువుతున్న పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించారు. కుమారి కె. పూజిత, తండ్రి వెంకట్రామ్‌రెడ్డికి రూ.20 వేలు, జి. రమాదేవి, తండ్రి సుదర్శన్‌రెడ్డికి రూ.15 వేలు, జి. రాజశ్రీరెడ్డి, తండ్రి జి. సుదర్శన్‌రెడ్డికి రూ.20 వేలు చొప్పున మొత్తం రూ.55 వేల ఆర్థిక సాయం అందించారు.

కార్యక్రమంలో పాలమూరు రెడ్డి సేవా సమితి అధ్యక్షుడు తూము ఇంద్రసేనారెడ్డి, ప్రధాన కార్యదర్శి వేపూరు రాజేందర్‌రెడ్డి, కోశాధికారి మల్లు నరసింహారెడ్డి, ప్రచార కార్యదర్శి సురేందర్‌రెడ్డి, కార్యదర్శి కోటేశ్వర్‌రెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, మహిళా అధ్యక్షురాలు మల్లు సరస్వతమ్మ, స్వరూప, శ్రీలత, కవిత, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.