ఉపాధి హామీ పనుల ప్రారంభం….

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలం పెద్దూరు గ్రామ పంచాయతీ పరిధిలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను సోమవారం ప్రారంభించారు. గ్రామంలోని చెరువులో పూడిక తీత పనులను సర్పంచ్ దీకొండ విజయ్ కుమార్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధి కూలీలు ప్రభుత్వం అందిస్తున్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ పనుల ద్వారా గ్రామాభివృద్ధితో పాటు కూలీలకు ఉపాధి లభిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పిట్టల రాజన్న, పంచాయతీ కార్యదర్శి ఎండి మునవర్ హుస్సేన్, జీపీ వార్డు సభ్యులు, ఈజీఎస్ టీఏ జాడీ కాంతారావు, ఫీల్డ్ అసిస్టెంట్ ప్రభాకర్, స్థానిక నాయకులు, ఉపాధి కూలీలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply