OTT Release | ఏయే ప్లాట్‌ఫామ్‌లో ఏమేం వస్తున్నాయో చూసేయండి!

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: అప్పుడే వీకెండ్ రానే వచ్చింది. ఇక సినిమా ప్రేక్షకులకు ఈ వారం కూడా పండగనే చెప్పాలి. ప్రతి వారంలాగే ఈసారి కూడా ఓటీటీలో సినిమాల జాతర అప్పుడే మొదలైపోయింది. ఇప్పటికే కొన్ని పెద్ద సినిమాలు ఓటీటీలో విడుదల కాగా, మరికొన్ని సినిమాలు ఈ వీకెండ్ స్ట్రీమింగ్ కావడానికి సిద్ధమవుతున్నాయి. అవునా.. మరి ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనేగా మీ సందేహం? సినిమా లవర్స్ కోసం ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఏయే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్నాయో.. ఓ లుక్కేసేయండి!

తెలుగు సినిమాలు, సిరీస్‌లు..

ఈ వారం తెలుగు ప్రేక్షకులను పండగనే చెప్పాలి. పెద్ద సినిమాలతో వెబ్ సిరీస్‌ ఈ వారం ఓటీటీలో అలరించేందుకు సిద్ధమయ్యాయి.

  • రామ్‌ చరణ్‌ పెద్ది, సింగీతం (SingGeetam) నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతుంది.
  • క్రేజీ తెలుగు ఒరిజినల్ సిరీస్గు ర్తుకొస్తున్నాయి (Gurthukosthunnayi) నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్‌ అవుతుంది.
  • సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ త్రికాల (Trikala)సన్‌నెక్స్ట్ అలాగే ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్‌ అవుతుంది.
  • కొత్త మలుపు (KothaMalupu) ప్రైమ్ వీడియో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అవుతుంది.
  • ఎంటర్‌టైనింగ్ మూవీ ఎకసెకాలు (Ekasekalu) త్వరలోనే అప్‌డేట్ కానుంది

తమిళ చిత్రాలు…

  • పరిమళ అండ్ కో (#ParimalaAndCo): ఈ చిత్రం జీ5 (Zee5) లో తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.
  • బల్ ఆక్యుపెన్సీ (DoubleOccupancy): అమెజాన్ ప్రైమ్ వీడియోలో సౌత్ లోని అన్ని ప్రధాన భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

మలయాళ, కన్నడ చిత్రాలు..

  • డోస్ (Dose): ఈ సినిమా ఏకంగా ప్రైమ్ వీడియో, సింప్లీ సౌత్, ఆహా తమిళ, లయన్స్ గేట్ ప్లే, మనోరమ మ్యాక్స్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో మలయాళ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో లభిస్తుంది.
  • బాల్టీ (Balti): సోనీ లివ్ (SonyLiv) లో మల్టీ లాంగ్వేజ్ రిలీజ్.
  • ల్యాండ్ ఆఫ్ ఫుట్‌బాల్ (Land Of Football): జియో హాట్‌స్టార్ (JioHotstar) లో సరికొత్త సిరీస్.
  • శిఖండి (Shikhandi): కన్నడ చిత్రం – ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

హిందీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు..

  • ఇక్కా (IKKA): నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో మోస్ట్ అవేటెడ్ మూవీ.
  • పతి పత్ని ఔర్ వో దో (PatiPatniAurWohDo): నెట్‌ఫ్లిక్స్ లో ఫన్ రైడ్ మూవీ.
  • మేడ్ ఇన్ ఇండియా – ఎ టైటాన్ స్టోరీ: ఎమ్‌ఎక్స్ ప్లేయర్ (MX Player) లో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో లభించే సిరీస్.
  • ముఖ్బీర్ – ది స్టోరీ ఆఫ్ ఎ స్పై (Mukhbir): జీ5 లో స్పై థ్రిల్లర్ డ్రామా.
  • దుగ్ దుగ్ (DugDug): ప్రైమ్ వీడియోలో సరికొత్త చిత్రం.

ఇంగ్లీష్ , ఇతర అంతర్జాతీయ చిత్రాలు..

  • నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో: ‘షిప్‌రెక్డ్: నైట్‌మేర్ ఎట్ సీ’, ‘లిటిల్ హౌస్ ఆన్ ది ప్రైరీ’, ‘అండర్‌టోన్’, ‘నథింగ్ టు లూజ్’ (ఫ్రెంచ్ – తెలుగు ఆడియోతో సహా).
  • ప్రైమ్ వీడియో (Rent): ‘బ్యాక్‌రూమ్స్’, ‘బ్లాక్ బాక్స్’, ‘ది ఫ్యూరియస్’, ‘గర్ల్స్ లైక్ గర్ల్స్’, ‘పాసెంజర్’.
  • ఇతర ప్లాట్‌ఫామ్‌లు: ‘ట్రైయింగ్ సీజన్ 5’ (Apple TV+), ‘వార్‌డ్రైవర్’ (Paramount+), ‘రిమైండర్స్ ఆఫ్ హిమ్’ (Peacock).

ఇక మరెందుకు ఆలస్యం, ఈ వీకెండ్‌కు మీ ఫేవరెట్ సినిమాలను వాచ్‌లిస్ట్‌లో యాడ్ చేసుకొని, ఇంట్లోనే పాప్‌కార్న్‌తో ఎంజాయ్ చేయండి!