వికారాబాద్ పాత పోలీస్ స్టేషన్ రోడ్డులో వన్‌వే అవసరం

వికారాబాద్ పాత పోలీస్ స్టేషన్ రోడ్డులో వన్‌వే అవసరం

  • ట్రాఫిక్ సమస్యలపై స్థానికుల ఆవేదన

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ వైపు వెళ్లే మార్గంలో ఉన్న పాత పోలీస్ స్టేషన్ రోడ్డులో వన్‌వే అమలు చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ రోడ్డులో మిషన్ స్కూల్ వైపు వెళ్లే మార్గంలో భారీ బ్యారికేడ్లు ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది.

వికారాబాద్ నుండి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు పాత పోలీస్ స్టేషన్ రోడ్డుమార్గంగా ఓవర్‌బ్రిడ్జ్ పైకి చేరాల్సి ఉండగా, హైదరాబాద్ నుండి వికారాబాద్‌కు వచ్చే వాహనాలు ఎన్టీఆర్ చౌరస్తా మీదుగా రావాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత ట్రాఫిక్ ఏర్పాట్లు సరైన విధంగా లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని సంబంధిత ఆర్ అండ్ బి, ట్రాఫిక్ పోలీస్ అధికారులు స్పందించి పాత పోలీస్ స్టేషన్ రోడ్డులో వన్‌వే అమలు చేస్తే ట్రాఫిక్ సమస్యలు తగ్గే అవకాశం ఉందని స్థానికులు కోరుతున్నారు. వెంటనే చర్యలు తీసుకుని రాకపోకలను సులభతరం చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.