NZB | చోరీ కేసులో ముగ్గురు అరెస్ట్..

మాక్లూర్, (ఆంధ్రప్రభ) : మాక్లూర్ మండల కేంద్రంలో ఈ నెల 14వ తేదీ తెల్లవారుజామున జరిగిన భారీ దొంగతనాన్ని ఛేదిస్తూ, ముగ్గురు దొంగలను మాక్లూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి కిలో వెండి కడియలు, రెండు జతల బంగారు బుట్టకమ్మలు స్వాధీనం చేసుకున్నారు.

ఈ వివరాలను మాక్లూర్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సి.ఐ శ్రీనివాస్, ఎస్సై రాజశేఖర్ వెల్లడించారు.

గుండ్ల పెద్దన్న ఇంటికి తాళం వేసి ఉన్నదని గమనించిన దొంగలు ఇంట్లోకి చొరబడి, బీరువాలో ఉన్న రూ. 2.50 లక్షల నగదు, రెండు కిలోల వెండి కడియలు, అర తులాల‌ బంగారు బుట్టకమ్మలను అపహరించినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో మాక్లూర్ పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు.

గ్రామంలోని అన్ని సీసీ కెమెరాల పుటేజీలను సేకరించి విశ్లేషించిన పోలీసులు, నిందితులను మూడు మంది స్థానికులుగా గుర్తించారు. బుధవారం వారిని అరెస్ట్ చేసి విచారణ జరిపినప్పుడు, దొంగతనం తాము చేసినట్లు అంగీకరించడంతో షేక్ హైమద్ (A1), షేక్ జలీల్ (A2), షేక్ అర్బస్ (A3)లను కేసులో నిందితులుగా చేర్చి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును పగడ్బందీగా ఛేదించిన ఎస్సై రాజశేఖర్, సిబ్బందిని సి.ఐ శ్రీనివాస్ అభినందించారు.