Oil Palm | కొండరెడ్ల గ్రామంలో మంత్రి తుమ్మల పర్యటన

Oil Palm | కొండరెడ్ల గ్రామంలో మంత్రి తుమ్మల పర్యటన

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజక వర్గం దమ్మపేట మండలం పూసుకుంట గ్రామంలో పలు అబివృద్ధి
    శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి తుమ్మల
  • ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో పామాయిల్ మొక్కలు నాటిన మంత్రి తుమ్మల
  • డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల
  • ఆదివాసీ గిరిజన రైతులకు పవర్ స్ప్రేయర్స్ , పవర్ మిల్స్, సోలార్ లైట్లు మంత్రి తుమ్మల చేతుల మీదుగా పంపిణీ

Oil Palm | దమ్మపేట, ఆంధ్రప్రభ : దమ్మపేట మండల కేంద్రానికి సుదూరంగా వున్న, అటవీ ప్రాంతమైన పూసుకుంట గ్రామంలో ఈ రోజు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao), అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పిఓ రాహుల్ తో కలసి ఈ రోజు పర్యటించారు.

Oil Palm |

అంతకు ముందు ఆయిల్ పామ్ ప్లాంటేషన్(Oil Palm Plantation) కార్యక్రమంలో మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే జారే పామాయిల్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ… ఆదివాసీ గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపేలా ఐ.టీ.డీ. ఏ ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

విద్యా, వైద్యం, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం బాధ్యత అని, ఆదివాసీ ప్రాంతాల్లో వ్యవసాయం చేసే వారికి విద్యుత్ కనెక్షన్లు(Electricity Connections), సోలార్ పంపు సెట్లు అందించాలని, అన్ని శాఖల అధికారులు నెలకొక సారి పూసుకుంట గ్రామాన్ని సందర్శించి గిరిజన, కొండరెడ్ల జీవన విధానం, ఆర్ధికంగా మెరుగుపడేటట్లు, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేటట్లు మాస్టర్ ప్లాన్ తయారు చేసుకోవాలని, వారి కుటుంబాలు స్వయం సమృద్ధి చెందాలని, భవిష్యత్ తరాలు సుఖంగా ఉండేటట్లుగా వారికి చేయూత నివ్వాలని సూచించారు.

Oil Palm |

చేతి వృత్తులు అంతరించకుండా ఐ.టీ.డీ. ఏ ఆధ్వర్యంలో చేయూత ఇవ్వాలన్నారు. వచ్చే శ్రీరామ నవమి నాటికి పూసుకుంట రోడ్డు పూర్తి చేయాలని ఆర్ అండ్ బి అధికారుల(R&B Officers)ను ఆదేశించారు. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి ఎమ్మెల్యే జారే ను తీసుకుని సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పించి ప్రత్యేక నిధులు మంజూరు చేయిస్తానని మంత్రి తుమ్మల అన్నారు.

ఆదివాసీ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ఐ టీ డీ ఏ నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. ఆధునిక నాగరిక సమాజంలో ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో అదే రీతిలో ఆదివాసులు ఉండటం కోసం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాలనలో సాధ్యం అవుతుందన్నారు.

ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ.. మారుమూల గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్ని రంగాల్లో పూసుకుంట, కట్కూరు గ్రామాలను అభివృద్ధి చేస్తామని ఇది నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. కలెక్టర్, ఐటిడిఏ పిఓ లు మాట్లాడుతూ… గిరిజనుల, కొండరెడ్ల ఆర్ధిక అభివృద్ధికి చేయూత నిస్తున్నామని తెలిపారు.

గైర్హాజ‌రైన‌ అధికారులపై మంత్రి తుమ్మల ఆగ్రహం..

Oil Palm |

పూసుకుంట పర్యటనకు హాజరు కాని అధికారులపై మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. కారణాలు తెలుసుకుని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణీ శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు(Paidi Venkateswara Rao), ఎల్లిన రాఘవరావు, కొయ్యల అచ్యుతరావు, రావు గంగాధరరావు, చిన్నశెట్టి యుగంధర్, నల్లగుళ్ల సత్యనారాయణ, కోటగిరి సత్యంబాబు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply