పేద ప్రజలకు ఎల్లవేళలా అండగా కూటమి ప్రభుత్వం

పేద ప్రజలకు ఎల్లవేళలా అండగా కూటమి ప్రభుత్వం

ఎమ్మెల్యే కూన రవికుమార్

ఆముదాలవలస, ఆంధ్రప్రభ: ఆముదాలవలస పట్టణంలోని 12వ వార్డు లక్ష్మీనగర్ వీధిలో సోమవారం ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఇంటింటికీ పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆముదాలవలస నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ మొత్తాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం పట్ల పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందన్నారు. అర్హులందరికీ న్యాయం జరిగేలా సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా, పారదర్శకంగా అమలు చేస్తున్నామని తెలిపారు.

ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతు మహిళలు సహా పలు వర్గాలకు ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు. ప్రజలకు ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని, ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధాప్య పింఛన్‌ను రూ.4,000కు, దివ్యాంగుల పింఛన్‌ను రూ.6,000కు, శాశ్వత వికలాంగుల పింఛన్‌ను రూ.15,000కు పెంచి అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు మురళి, మున్సిపల్ మాజీ చైర్మన్ తమ్మినేని గీతా సాగర్, బోయిన సునీత, కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ వార్డులో పింఛన్ అందుకున్న వృద్ధులు, మహిళలు ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు, కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply