విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలి..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగితే జీవితంలో స్థిరపడతారని చిన్న పొర్ల సర్పంచ్ గాండ్ల నిఖిత ప్రశాంత్, మాజీ సర్పంచ్ మాలి పటేల్ రవీందర్ రెడ్డి అన్నారు. శనివారం నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని చిన్నపోర్ల జెడ్ పి హెచ్ ఎస్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండల స్థాయిలో 568 మార్కులు సాధించి ప్రథమ స్థానం పొందిన పి. పూజను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
పాఠశాల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎం. కీర్తన, యు. కళ్యాణి, పి. అక్షిత, కే. కీర్తి, కే. పార్వతమ్మ, సి. సంజీవ్ బి. గణేష్ లు శ్రద్ధగా చదువుకొని గ్రామానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావడంతోపాటు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలన్నారు. విశ్రాంత జిహెచ్ఎం భాస్కర్ రెడ్డి విద్యార్థులను అభినందించి, ప్రథమ స్థానం పొందిన పి. పూజకు 5000 నగదు బహుమతి రెండవ స్థానం పొందిన ఎం. కీర్తనకు 2500 నగదుఅందజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కాంబ్లే సత్యనారాయణ, మహాత్మ జ్యోతిబా ఫూలే స్వచ్ఛంద సంస్థ సభ్యులు, రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎం. భాస్కర్ రెడ్డిపాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
