ఒక రోజు విచారణకు కోర్టు అనుమతి
గుంటూరు ప్రభుత్వ హాస్పటల్లో వైద్య పరీక్షలు
సిఐడి కార్యాలయంలో కొనసాగుతున్న విచారణ
గుంటూరు – వైసీపీ నేత పోసాని కృష్ణ మురళిని సీఐడీ పోలీసులు నేడు కస్టడీలోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పోసానిని ఒక్కరోజు కస్టడీ విచారణకు కోర్టు అనుమతించింది. ప్రస్తుతం సీఐడీ కేసులో గుంటూరు జైలులో వైసీపీ నేత రిమాండ్‌లో ఉన్నారు. దీంతో జిల్లా జైలు నుంచి పోసానిని సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందుగా ఆయనకు గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు.. ఆ తర్వాత విచారణకు గుంటూరులోని సిఐడి కార్యాలయానికి తరలించారు. ప్రస్తుతం అక్కడ విచారణ కొనసాగుతున్నది.. ఈ విచారణ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.. అనంతరం ఆయనను జైలుకు తరలిచంనున్నారు.