ఎస్‌ఎన్‌జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

ఎస్‌ఎన్‌జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ
భవానీపురం, ఆంధ్రప్రభ: వేసవిని దృష్టిలో ఉంచుకుని సామాజిక బాధ్యతగా ఎస్‌ఎన్‌జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. 65 రోజులుగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఫౌండేషన్ సభ్యులు, శుక్రవారం 66వ రోజు కూడా మజ్జిగ పంపిణీ చేపట్టారు.
వీఎంసీ కార్పొరేషన్ వద్దనున్న ప్రకృతి వనంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు.
అనంతరం పర్యావరణ పరిరక్షణ కోసం ఎస్‌ఎన్‌జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. పాఠశాలలు, ఆసుపత్రులు, రహదారుల పక్కన, ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న ఫౌండేషన్ సభ్యులను ప్రత్తిపాటి శ్రీధర్ అభినందించారు.
సామాజిక సేవతో పాటు పర్యావరణ పరిరక్షణకు ఎస్‌ఎన్‌జీ ఫౌండేషన్ ప్రత్యేక దృష్టి సారించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌ఎన్‌జీ ఫౌండేషన్ చైర్మన్ లయన్ కె. శారదవాణి, లయన్ కేవీడీ ప్రసాద్, సభ్యులు ఎర్నిని పద్మజ, మల్లికార్జునరావు, కుమారి, విజయలక్ష్మి పాల్గొన్నారు.
షా న్యూస్ ఎడిటర్ హుమాయున్, మల్లికార్జున, వాణి, సంసుద్దిన్, వంశీ, విజయ్, ఆదిత్య, జనసేన నేతలు బొల్లేపల్లి కోటేశ్వరరావు, ఏలూరు సాయి శరత్, సుజనామిత్ర కోఆర్డినేటర్ దొడ్ల రాజా పాల్గొన్నారు.
