ఇసుక రవాణాకు కొత్త నిబంధనలు..

ఇసుక రవాణాకు కొత్త నిబంధనలు..

  • అతిక్రమిస్తే కఠిన చర్యలు
  • చిట్యాల ఎస్ఐ పోచంపల్లి సతీష్

చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలో మానేరు, చలి వాగుల నుండి ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని చిట్యాల ఎస్ఐ పోచంపల్లి సతీష్ తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక రవాణాకు కొత్త నిబంధనలు, ధరలను ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. భూపాలపల్లి నియోజకవర్గానికి మాత్రమే ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు ట్రాక్టర్ లలో సరైన పత్రాలతో ఇసుక రవాణా చేయాలన్నారు. తాసిల్దార్ కార్యాలయంలో ఇందిరమ్మ కూపన్లు, ట్రాక్టర్ ఇంజన్, ట్రాలీ నెంబర్, రిజిస్ట్రేషన్ పేపర్లు, డ్రైవింగ్ లైసెన్స్ పత్రాలు నమోదు చేసుకోవాలన్నారు.

నియోజకవర్గంలోని మండలాలకు ప్రభుత్వం నిర్ణయించిన ట్రాక్టర్ ఇసుక తరలింపు, ధరల పట్టిక, ఎస్సై సతీష్ తెలిపారు. గోరి కొత్తపల్లి మండలంకు రూ 4000, రేగొండ, గణపురం, భూపాలపల్లి, మండలాలకు రూ 3500, చిట్యాల మండలంకు రూ 2200, టేకుమట్ల, మొగుళ్లపల్లి, మండలాలకు రూ 2000, ప్రభుత్వంనిర్ణయించినట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధికంగా వసూలు చేసిన, పత్రాలు లేకుండా రవాణా చేసిన ట్రాక్టర్లు సీజ్ చేసి, కఠిన కేసులు నమోదు చెయ్యనున్నట్లు ఎస్సై సతీష్ హెచ్చరించారు.