తిరుచ్చి ఈస్ట్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా
తిరుచ్చి ఈస్ట్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో పెరంబూర్ , తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే తాజాగా తిరుచ్చి ఈస్ట్ ను వదిలి పెరంబూర్ నుంచి ఎమ్మెల్యే గా కొనసాగాలని విజయ్ నిర్ణయం తీసుకున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. ఒక అభ్యర్థి ఒకే సారి రెండు స్థానాలలో పోటీ చేయచ్చు కానీ రెండు చోట్ల గెలిస్తే.. ఒక స్థానానికి రాజీనామా చేయాలి. అందుకే విజయ్ తిరుచ్చి ఈస్ట్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
