ఘనంగా పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం…

ఘనంగా పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం…

ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పులిమామిడి 2009- 2010 ఎస్ ఎస్ సి పూర్వ విద్యార్థులు ఆదివారం పులిమామిడి జడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకున్నారు. తమకు పాఠాలు నేర్పిన గురువులకు సన్మానం చేసి ఆశీస్సులు తీసుకున్నారు.

పదవ తరగతి చదువుకొని 16 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకొని అలనాటితీపిజ్ఞాపకాలునెమరు వేసుకున్నారు. ఒకరినొకరు కలుసుకొని జీవితంలో వారు చేస్తున్న వివిధ వృత్తులు, తదితర అంశాలను చర్చించుకొని ఆనందంగా ఉల్లాసంగాగడిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎం ఫయాజుద్దీన్ విష్ణువర్ధన్, బాలకృష్ణ సావన్న, సత్య, గురుపాదయ్య హిమాలయ హేమలత, పూర్వ విద్యార్థులు సూర్యకాంత్ గోపి రాధిక అనిత తదితరులు పాల్గొన్నారు.