Naga Chaitanya | ప్లానింగ్ మారిందా..?

Naga Chaitanya | ప్లానింగ్ మారిందా..?

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం వృషకర్మ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కార్తీక్ దండు డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ మిస్టిక్ థ్రిల్లర్ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తర్వాత సినిమా ఎవరితో అనేది ఇంకా అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు పవర్ స్టార్ డైరెక్టర్ తో చైతూ సినిమా అంటూ ప్రచారం జరుగుతుంది. ఇంతకీ.. ఇది నిజమేనా..?

Naga Chaitanya | డిఫరెంట్ కాన్సెప్ట్ తో వృషకర్మ..

Naga Chaitanya

చైతన్య తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి ఫామ్ లోకి వచ్చాడు. ఈ మూవీ ఇచ్చిన సక్సెస్ జోష్ తో ఇక నుంచి డిఫరెంట్ మూవీస్ చేయాలని పిక్స్ అయ్యాడు. అందుకనే 100 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో వృషకర్మ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో చైతన్యకు జంటగా మీనాక్షి చౌదరి నటిస్తుంది.

ఈ మూవీ ఆడియన్స్ కి థ్రిల్ కలిగించేలా ఉంటుందని.. ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని ఈ మూవీ మేకర్స్ గట్టి నమ్మకంగా ఉన్నారు. ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటుంది. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించే ఛాన్స్ ఉంది.

Naga Chaitanya | చైతూ మాస్ మూవీ..

Naga Chaitanya

ఇక అసలు విషయానికి వస్తే.. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిస్తున్న వృషకర్మ చైతన్యకు 24వ సినిమా. 25వ సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. 25వ సినిమా శివ నిర్వాతో ఉంటుందని ప్రచారం జరిగింది కానీ.. అది క్యాన్సిల్ అయ్యింది. ఆతర్వాత కొరటాల శివ పేరు వినిపించింది. ఇది కూడా సెట్ కాలేదు. ఇప్పుడు పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో చైతూ సినిమా అని టాక్ వినిపిస్తుంది.

Naga Chaitanya

ఈ మాస్ డైరెక్టర్ తో చైతన్య సినిమా చేయబోతున్నాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తుండడంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం హరీష్ శంకర్ తెరకెక్కించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మార్చి లేదా ఏప్రిల్ లో రిలీజ్ కానుంది. ఆతర్వాత చైతన్యతో హరీష్ శంకర్ మూవీ అని టాక్. మరి.. ప్రచారంలో ఉన్నది నిజమౌతుందో లేదో చూడాలి.

CLICK HERE TO READ పవర్ స్టార్ అభినందనలు..

CLICK HERE TO READ MORE

Leave a Reply