మేడ్చల్‌లో బీజేపీ శ్రేణుల ఆందోళన

మేడ్చల్‌లో బీజేపీ శ్రేణుల ఆందోళన

మేడ్చల్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భారత ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖర్గే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, బుధవారం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలోనీ మేడ్చల్ పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. మేడ్చల్ సర్కిల్ అధ్యక్షురాలు జెల్లీ శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ పార్టీకి ఖర్గేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గౌరవప్రదమైన ప్రధానమంత్రిని ‘టెర్రరిస్ట్’ అని సంబోధించడం అత్యంత హేయమైన చర్య అని బీజేపీ నాయకులు మండిపడ్డారు. ​ ప్రపంచ దేశాలన్నీ నేడు భారతదేశం వైపు గౌరవంగా చూస్తుంటే, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఖర్గే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేశాన్నే అవమానించడమని వారు పేర్కొన్నారు.

ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఖర్గేను కాంగ్రెస్ అధిష్టానం తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని, లేనిపక్షంలో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ​”భారత ప్రధానిని కించపరచడం అంటే భారత ప్రజాస్వామ్యాన్ని, పౌరులను కించపరచడమే. దీనిపై ప్రతి భారతీయుడు స్పందించాల్సిన అవసరం ఉంది.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పాతూరి ప్రభాకర్ రెడ్డి, జిల్లా నాయకులు శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి జాకట ప్రేమ్ దాస్, ఉపాధ్యక్షులు మైసరి రాజు, సర్వేశ్వర్ రెడ్డి, కార్యదర్శి బండి విష్ణు మూర్తి, సురేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు సి.హెచ్. శ్రీనివాస్ గౌడ్, రాఘవ రెడ్డి, మాజీ సర్పంచ్ మురళీధర్ గుప్తా, నాయకులు వంశీధర్ రెడ్డి, మహేష్, చిర్ల సత్యనారాయణ, నాగరాజు, పద్మ, శ్రీపాల్ రెడ్డి, రతన్ రాథోడ్, సందీప్ రెడ్డి, నవీన్ చారి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply