కొమ్మలపాటి శ్రీధర్ కు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియామకం..

కొమ్మలపాటి శ్రీధర్ కు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియామకం..

చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : మాజీ ఎమ్మెల్యే, జిల్లా టిడిపి అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ కు టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించడం పై పల్నాడు జిల్లా టీడీపీ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.ఎం.డి హనీఫ్ హర్షం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే, జిల్లా టిడిపి అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ కు టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించడం అభినందనీయం అన్నారు.

ఈ సందర్భంగా శుక్రవారం డాక్టర్ హనీఫ్ కొమ్మాలపాటిని ఆయన స్వగృహంలో కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ హనీఫ్ మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి తెలుగుదేశం పార్టీలో చేసిన విశిష్ట సేవలను గుర్తించి పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ కార్యదర్శి, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ కీలక బాధ్యతలను అప్పగించారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి 2024 జరిగిన సార్వత్రిక ఎన్నికలలో జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలతో పాటు నరసరావుపేట లోక్ సభ స్థానాన్ని గెలుపొందే విధంగా తన వంతు కృషి చేశారని తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply