చెన్నూరులో రోడ్డు వెడల్పు పనులకు శ్రీకారం

చెన్నూరు, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాల్టీ పరిధిలోని మెయిన్ రోడ్డును వెడల్పు చేసేందుకు అధికారులు మరో ఐదు రోజుల్లో శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక అంబేద్కర్ చౌక్ నుంచి పెద్ద చెరువు (కోటపెల్లి బస్ స్టాప్) వరకు వ్యాపారాలు నిర్వహిస్తున్న షాప్ యజమానులు, గతంలో అధికారులు చేపట్టిన కొలతల ప్రకారం తమ దుకాణాలను ఐదు రోజుల్లో ఖాళీ చేయాలని మున్సిపల్ అధికారులు సూచించారు.

పట్టణంలోని ప్రధాన రహదారి ఇరుకుగా మారడంతో వాహన రాకపోకలకు నిత్యం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు రహదారిని 66 అడుగులకు వెడల్పు చేయాలని అధికారులు గత ఆరు నెలల క్రితమే ప్రణాళికలు రూపొందించారు. అయితే, ఈ ప్రాంతంలోని వ్యాపారులు రోడ్డు వెడల్పు విషయంలో కొంత రాయితీ (తగ్గింపు) ఇవ్వాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామికి వినతిపత్రం సమర్పించారు.

Leave a Reply