గంగణమ్మ తల్లి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే…
పెడన, ఆంధ్రప్రభ ; పెడన మండలం చేవెండ్ర గ్రామంలో శ్రీ గంగణమ్మ తల్లి వారి దేవస్థానం ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. అనంతరం చేవెండ్ర గ్రామంలో శివాలయం మరియు శ్రీ నల్లమోతు వారి దేవరమ్మ తల్లి దేవస్థానంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు శ్రీ గంగణమ్మ తల్లి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ ఆకాంక్షించారు.
