పేద రోగులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

పేద రోగులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

  • సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే జి ఎస్ ఆర్

చిట్యాల, ఆంధ్రప్రభ : పేద రోగులకు హాస్పటల్ ఖర్చుల కోసం సీఎంఆర్ఎఫ్ నిధులతో అండగా నిలుస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు . మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో చిట్యాల, టేకుమట్ల మండలాలకు చెందిన 67 మంది బాధిత లబ్ధిదారులకు సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నిరుపేదలు హాస్పటల్ పెట్టిన ఖర్చులు లో ప్రభుత్వం అండగా ఉంటూ సీఎంఆర్ ఎఫ్ ద్వారా చెక్కులు అందించడం జరుగుతుందన్నారు.

ఆరోగ్యశ్రీ గతంలో ఐదు లక్షలు ఉండగా ప్రజాపాలన ప్రభుత్వం రూ 10 లక్షలకు పెంచిందన్నారు. పేద ప్రజల ఆరోగ్యం ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ వసంతరావు, మార్కెట్ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి, ప్రజా ప్రతినిధులు, నాయకులు, గూట్ల తిరుపతి ముఖిరాల మధు వంశీకృష్ణ, పులి తిరుపతిరెడ్డి, దొడ్డికిష్టయ్య, బుర్ర శ్రీనివాస్, గంగాదరి రవీందర్, అల్లకొండ కుమార్ , కట్కూరి నరేందర్, రెండు మండలాల సర్పంచులు, గుంటుపల్లి నాగమల్లేశ్వరరావు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.