ఇందిరాగాంధీ రిజర్వేషన్ల ద్వారానే గిరిజన అభివృద్ధి

పంచశీల సూత్రాల వల్ల గిరిజనులకు విముక్తి
సెప్టెంబరు 18న ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ
గిరిజనకాంగ్రెస్ ఎంపీ ఎమ్మెల్యేలు

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : బంజారాలను అందరినీ ఏకం చేసేందుకు ఇందిరాగాంధీ కృతజ్ఞతయాత్ర చేస్తున్నామని కాంగ్రెస్ ఎస్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు తెలిపారు. రిజర్వేషన్ల స్వర్ణోత్సవ యాత్ర సందర్భంగా ఆదివాసీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో చేపట్టిన యాత్ర నాగర్‌కర్నూల్ చేరుకుంది. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్ మాట్లాడుతూ ఎస్టీలకు రిజర్వేషన్లు వచ్చి 50 సంవత్సరాలు అవుతున్నాయన్నారు. ఈ ఘనత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వల్లే సాధ్యం అయ్యిందన్నారు. ఇందిరా, రాజీవ్‌గాంధీ త్యాగాలతోనే ఎస్టీల అభివృద్ధి జరిగింది అన్నారు.

చరిత్రను ఎవరూ మార్చలేరన్నారు. గ్రామాలతో పోటీ పడేలా తండాలను అభివృద్ధి పర్చేలా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. రిజర్వేషన్లు వచ్చి 50 ఏండ్లు కావస్తున్న సందర్భంగా ఇందిరాగాంధీకి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నామని, అందులో భాగంగా సెప్టెంబరు 18న ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ.. కేసీఆర్ నలుగురు బంజారా బిడ్టలు ప్రాణాలు కోల్పోయిన ఏమీ చేయలేదన్నారు. మళ్లీ ఆదివాసీ, బంజారా జాతుల‌ మధ్య చిచ్చుపెట్టారని విమర్శించారు. అలాగే జీఓ 3 రద్దు చేసి ఉద్యోగాలు కోల్పోయేలా కుట్రలు చేశారన్నారు. గతంలో 86వేల కోట్ల రుణమాఫీ కాంగ్రెస్ చేసిందన్నారు.

రాష్ట్రంలో ఎస్టీలు అందరూ ఇందిరా గాంధీకి కృతజ్ఞతలు చెప్పుకోవాలని, బీఆర్ఎస్, ఇతర పార్టీల భ్రమలో పడకూడదన్నారు. ఎల్బీ స్టేడియంలో సభకు లక్షలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. అన్ని గ్రామాల్లో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామన్నారు. రవీంద్ర నాయక్ మాట్లాడుతూ కేసీఆర్ ఎస్టీల మద్య విభేదాలు సృష్టించారని అన్నారు. 40వేల కోట్ల డబ్బులు దారి మళ్లించారని, సత్యవతి రాథోడ్, కవితలు కేసీఆర్ ని ఏనాడూ ప్రశ్నించలేదన్నారు. 7వేల కోట్ల వడ్డీ కట్టడానికి కేసీఆర్ కారణం అన్నారు. సత్యవతి ముందు చెప్పులు తొడుక్కోవాలన్నారు.

సేవాలాల్ తో కేసీఆర్ ను పోల్చవద్దన్నారు. గిరిజన ప్రాంతాలు పోయినా జీఓ 3పై సంతకం పెట్టారన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, రాందాస్ నాయక్, బాలునాయక్, మురళినాయక్, జిల్లా ఎమ్మెల్యేలు డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ రాజేష్ రెడ్డి, ట్రైకార్ ఛైర్మన్ బెల్లయ్య నాయక్, మాజీ ఎంఎల్సీ రాములు నాయక్ పాల్గొన్నారు.