MLA | పట్టణ సుందరీకరణ పూర్తి చేస్తాం…

MLA | పట్టణ సుందరీకరణ పూర్తి చేస్తాం…

  • అభివృద్ది అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తా
  • టీచర్స్ కాలనీ అభివృద్ధికి రూ.3 కోట్లు మంజూరు చేశాం
  • మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించండి
  • పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు

MLA | పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి పట్టణ సుందరీకరణ సకాలంలో పూర్తి చేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తెలిపారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని టీచర్స్ కాలనీలో కాంగ్రెస్ నాయకులు గుజ్జుల కుమార్ తన సొంత ఖర్చులతో నూతనంగా నిర్మించిన కమాన్ ను కాలనీవాసులు, స్థానిక నాయకులతో కలిసి ఈ రోజు ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ… పట్టణంలోని 5వ వార్డు టీచర్స్ కాలనీలో రూ. 3 కోట్ల 1 లక్షతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వాటి పనులు త్వరలో ప్రారంభిస్తామని అన్నారు. గత సంవత్సరంలో టీచర్స్ కాలనీ అభివృద్ధికి రూ. 53 లక్షలు కేటాయించినట్లు, ఇప్పటి వరకు టీచర్స్ కాలనీ అభివృద్ధికి రూ. 3.54 కోట్ల నిధులను కేటాయించామని వివరించారు.

పెద్దపల్లి పట్టణం దశలవారీగా సుందరంగా మారుతోందని గుర్తు చేశారు. పట్టణ ప్రజలు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అరిశిర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు నూగిల్ల మల్లయ్య, భూషణవేన సురేష్ గౌడ్, శ్రీమాన్, జడల సురేందర్, బొడ్డుపల్లి శ్రీనివాస్, బూతగడ్డ సంపత్, మాదారపు ఆంజనేయ రావు, పిడుగు సంపత్, టీచర్స్ కాలనీ వాసులు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.