Minister | గుర్రం దాడిలో మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శ‌…

Minister | గుర్రం దాడిలో మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శ‌…

Minister | కరీమాబాద్, ఆంధ్రప్రభ : ప్రమాదవశాత్తు గుర్రం దాడిలో మృతి చెందిన కుటుంబ సభ్యులను శివనగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీరామ రాజేష్ పగడాల సతీష్ పరామర్శించారు. వరంగల్ నగరంలోని శివనగర్ పాడి మల్లారెడ్డి నగర్ కి చెందిన మిరియాల కృష్ణ రజిత దంపతుల కుమారుడు మిరియాల గౌతమ్(12) ఖిలా వరంగల్ చిల్డ్రన్స్ పార్క్(Children’s Park)ను చూడడానికి వెళ్లి అక్కడ ఉన్న గుర్రం వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు గుర్రం తన్నగా గౌతమ్ అనే బాలుడు(12)మృతి చెందాడు.

విషయం తెలియగానే ఈ రోజు కాంగ్రెస్ నాయకులు శ్రీరాం రాజేష్ పగడాల సతీష్ లు వారి స్వగృహానికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి పేదవారైనా ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీరామ్ రాజేష్ మాట్లాడుతూ.. మంత్రి కొండా దంపతుల(Minister Konda couple) దృష్టికి విషయాన్ని తీసుకుని వెళ్లి వారి చేత కూడా తగిన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అక్షిత్ పటేల్, మాన్యం సతీష్,సంఘని ప్రియదర్శిని,గడ్డం లత , స్థానికలు పాల్గొన్నారు.

Leave a Reply