Minister l సోలార్ విద్యుత్ సిస్టం ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి


Minister l సోలార్ విద్యుత్ సిస్టం ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి

పాలుట్ల గిరిజన గూడెంలో సోలార్ విద్యుత్ కాంతులు
అంధకారంలో ఉన్న గిరిజన ప్రజల విద్యుత్ కష్టాలు తీర్చిన కూటమి ప్రభుత్వం
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన తండాల్లో సోలార్ ద్వారా విద్యుత్ అందిస్తాం
గిరిజన ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించటమే ప్రభుత్వ ద్యేయం
గిరిజన గూడెంలో సోలార్ విద్యుత్ ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి

Minister l యర్రగొండపాలెం,ఆంధ్రప్రభః యర్రగొండపాలెం గిరిజన గూడెల్లో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించి వారి అభివృద్దే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో మైదాన గ్రామాలకు దూరంగా ఉన్న పలు గిరిజన గూడెల్లో దశాబ్దాల నుండి విద్యుత్ సౌకర్యం లేక చీకట్లో గడుపుతూ ఇబ్బందులు పడుతున్న ప్రజలకు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ప్రత్యేక కృషితో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సహకారంతో కూటమి ప్రభుత్వంలో విద్యుత్ కష్టాలు తీరాయి. రూ.2 కోట్ల 86 లక్షల వ్యయంతో 611 గృహాలకు ఆప్ గ్రేడ్,సోలార్ విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేశారు. మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సోలార్ విద్యుత్ లైట్స్ వెలిగించి ప్రారంభించారు.

పాలుట్ల గూడెంలో విద్యుత్ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లామని మంత్రి రవి కుమార్ తెలిపారు. సీఎం సానుకూలంగా స్పందించి విద్యుత్ సౌకర్యం కల్పించడానికి అంగీకరించి ఒక్కో గృహానికి రూ.50 వేల విలువైన సోలార్ విద్యుత్ పరికరాలకు నిధులు మంజూరు చేసారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గిరిజన తండాలో సోలార్ ద్వారా విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ఆయిల్ ఇంజన్ల ద్వారా ఖర్చులు పెరిగి వ్యవసాయం చేయటం కష్టంగా ఉందని పాలుట్ల గిరిజన రైతులు మంత్రి దృష్టికి తెలిపారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే యర్రగొండపాలెం నుండి పాలుట్ల వెళ్లే రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

పాలుట్ల గిరిజన గూడెం ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యను తను దగ్గర నుండి స్వయంగా చూశానని నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు. వారి సమస్యలను తీర్చాలని సంకల్పంతో కృషి చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు సోలార్ ద్వారా వెలుగులు అందించామని చెప్పారు. మరో 100 గృహాలకు సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని మంత్రిని కోరారు. ఈ పథకం కింద పాలుట్ల, గుట్టల చెను,పొన్నాల బయలు,బుడు గుండాల,నారు తడికల గిరిజన గూడెలకు 511,అలాగే చిన్నారుట్ల 5,పెద్దరుట్ల 32,రోళ్ల పెంట 3,నెక్కంటి 17,పెద్ద చేను 3 గృహాలకు సోలార్ సిస్టం ఏర్పాటు చేశారు. ఈ సోలార్ ద్వారా అమర్చిన గృహంలో ఒక ఫ్యాన్,లైట్లు 5,డిసి సిస్టం1,ప్యానల్ బోర్డు1,సెల్ ఫోన్ ఛార్జింగ్ అవసరమైన విద్యుత్ పరికరాలు ఏర్పాటు చేశారు.