గన్నవరం మండలంలో భారీ చోరీ

గన్నవరం మండలంలో భారీ చోరీ

గన్నవరం, ఆంధ్రప్రభ : గన్నవరం మండలం మెట్లపల్లి గ్రామంలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. రూ.20 లక్షల విలువ చేసే 16 తులాల బంగారం, వెండి వస్తువులను దొంగలు అపహరించారు. బుధవారం మధ్యాహ్నం ఇంటి యాజమాని వీరంకి వెంకటేశ్వరరావు తన భార్యతో కలిసి మైలవరం తన బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీ జరిగింది. గన్నవరం పోలీసులకు ఇంటి యజమాని వీరంకి వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేసారు.

Leave a Reply