జాగృతి కళా బృందంతో.. సైబర్ చైతన్యం

జాగృతి కళా బృందంతో.. సైబర్ చైతన్యం

నర్సంపేట, ఆంధ్రప్రభ : రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నర్సంపేట ఎసిపీ రవీందర్ రెడ్డి స్పష్టం చేశారు. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 11వ, వార్డు ముగ్ధంపురంలో జాగృతి పోలీస్ కళా బృందం ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, మూఢనమ్మకాలు, మాదక ద్రవ్యాలు, రోడ్డు ప్రమాదాలు, చైన్ స్నానచింగ్ ల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.

కళా బృందం పాటలు, మ్యాజిక్ షోలతో ప్రజలను ఎంతగానో ఆకర్షించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, చెన్నారావుపేట ఎస్సై రాకేష్ రెడ్డి , కౌన్సిలర్ చీకటి స్వరూప ఓదయ్య గౌడ్, స్కూల్ హెచ్ఎం కొమ్మలు, మాజీ ప్రజా ప్రతినిధులు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply