విశ్వబ్రాహ్మణులందరు ఐక్యంగా ఉండి అభివృద్ధి చెందాలి..

రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కాసోజు శంకరమ్మ

జన్నారం, ఆంధ్రప్రభ : విశ్వబ్రాహ్మణులందరూ ఐక్యంగా ఉండి అభివృద్ధి చెందాలని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు, తెలంగాణ కోసం అమరుడైన శ్రీకాంతచారి తల్లి కాసోజు శంకరమ్మ అన్నారు. ది అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ మంచిర్యాల జిల్లా జిల్లా విశ్వబ్రాహ్మణుల బంధువుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జన్నారం మండల కేంద్రంలోని జ్యోతి ఫంక్షన్ హాల్ లో ఆ మహాసభ జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల గంగాధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా తెలంగాణ కోసం అమ్ముడైన శ్రీకాంత్ చారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, విశ్వబ్రాహ్మణుల సమస్యల సాధన కోసం నిరంతరం పోరాడుతానన్నారు. విశ్వబ్రాహ్మణులందరూ ఐక్యంగా ఉండి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవలసిన సమయం ఆసన్నమైందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తనను గుర్తించి రాష్ట్ర మహిళ కమిషన్ సభ్యురాలుగా నియమించిందని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో ఆ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కాలె జగన్నాథం మాట్లాడుతూ, విశ్వబ్రాహ్మణుల కోసం నిరంతరం పాటుపడతానన్నారు.

విశ్వబ్రాహ్మణులందరూ పట్టింపులకు పోకుండా అందరూ ఏకమై చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించేలాగా పోరాటం చేయవలసిన సమయం ఆసన్నమైందని, కుల బాంధవులందరూ గ్రూపు రాజకీయాలు చేయకూడదని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఆ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంకోజు లింగా చారి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కట్ట వెంకటేష్, జిల్లా గౌరవ అధ్యక్షుడు యశోద గురువయ్య, రాంపూర్ సర్పంచ్ నూతి రామయ్య, నేతలు కట్ట రాజమౌళి, లోకనాథం, కాసోజు శ్రావణి, సంతోష్ లక్ష్మణాచారి, వెయ్యిగండ్ల రవి, బండోజు లక్ష్మీనర్సయ్య, కిషన్ భూమాచారి, మామిడి హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.