హామీలు ఇవ్వడం కాదు అభివృద్ధి చేసి చూపిస్తా

హామీలు ఇవ్వడం కాదు అభివృద్ధి చేసి చూపిస్తా
- 2వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గోమాస ప్రవీణ్
బెల్లంపల్లిరూరల్, ఆంధ్రప్రభ : హామీలు ఇవ్వడం కాదు అభివృద్ధి చేసి చూపిస్తా రెండోవార్డు కాంగ్రెస్ అభ్యర్థి గోమాస ప్రవీణ్ తెలిపారు. గురువారం బెల్లంపల్లి మున్సిపాలిటీ రెండో వార్డులో ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాటల నాయకున్ని కాదని తాను పనిచేసే నాకుడనని తెలిపారు. డ్రైనేజీ సమస్య వీధిదీపాల సమస్య చెత్త సమస్య తనకు తెలుసునని నేను మీలో ఒకడిగా ఉండి అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. ఎప్పుడూ వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సహాయ సహకారాలతో కొత్త బస్టాండ్ ఇందిరమ్మ కాలనీలో సిసి రోడ్లు ఏర్పాటుకు డ్రైనేజీలనిర్మాణానికి కృషి చేస్తానన్నారు. ఫుట్బాల్ గ్రౌండ్ వెనక ఉన్న శివాలయం అభివృద్ధికి కృషి చేస్తా,వార్డులో అంగన్వాడి కేంద్రం నిర్మాణానికి స్థలం ఇప్పించి భవన నిర్మాణానికి సహకారం అందిస్తానని ప్రవీణ్ పేర్కొన్నారు.
