వర్షాల కోసం ఓంకారేశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలు..

వర్షాల కోసం ఓంకారేశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలు..

దేవరకద్ర, ఆంధ్రప్రభ : కౌకుట్ల మండలం, పేరూరు గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పేరూరు గ్రామంలోని శ్రీ ఓంకారేశ్వర ఆలయంలో పరమశివుడికి ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు.
గ్రామ సర్పంచ్ కొత్త శృతి అరవింద్ రెడ్డి, ఉప సర్పంచ్ గొల్ల రాములు ఆధ్వర్యంలో గ్రామస్తులు బీచుపల్లి నుంచి కృష్ణా నది పవిత్ర జలాలను తీసుకువచ్చి శివుడికి భక్తిశ్రద్ధలతో జలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని, రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, గ్రామ ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.