సీఎం సభను విజయవంతం చేయాలి..
- మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్
పరకాల, ఆంధ్రప్రభ : ఈ నెల 16న పరకాల పట్టణంలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని పరకాల మున్సిపల్ ఒకటో వార్డు మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్‌కుమార్ పిలుపునిచ్చారు.
ఈ నెల 16న పరకాల పట్టణంలో వంద పడకల ఆసుపత్రి, డిగ్రీ కళాశాల, ఆర్టీసీ బస్టాండ్, సమీకృత పాఠశాలతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఎంకు పెద్దఎత్తున స్వాగతం పలకాలని, మధ్యాహ్నం గొడ్ల అంగడిలో నిర్వహించే బహిరంగ సభకు ఒకటో వార్డు నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.
ఈ మేరకు ఒకటో వార్డు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కమిటీ వైస్ చైర్మన్ డాక్టర్ మడికొండ శ్రీను హాజరయ్యారు. పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. పరకాల ప్రజల చిరకాల వాంఛలు నెరవేరుతున్నాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు, సమన్వయ కమిటీ సభ్యులు, మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్‌కుమార్, ఒకటో వార్డు కాంగ్రెస్ పార్టీ వార్డు కమిటీ అధ్యక్షుడు మడికొండ సంపత్, నాయకులు బొచ్చు భాస్కర్, ఒంటెరు సుధాకర్, మద్దెల భద్రయ్య, దుబాసి తిరుపతి, బజారు శంకర్, మంద ఆనంద్‌కుమార్, ఒంటెరు ప్రణీత్, జూపాక కిషన్, బొచ్చు అంజి, కోడెపాక రాకేష్, ఇనగాల రాకేష్, మడికొండ నవీన్, మడికొండ మహేష్, దుబాసి రానాప్రతాప్, దుబాసి దామోదర్, సంఘీ అభిలాష్, జస్వంత్, ఒంటెరు సారయ్య, ఒంటెరు రజిత, సంఘీ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.
