బీసీ సేన జిల్లా అధ్యక్షుడు ప్రకాష్‌ జన్మదిన వేడుకలు

హాజరైన జాతీయ బీసీ సేన అధ్యక్షుడు బర్కా కృష్ణ

బాలానగర్‌, ఆంధ్రప్రభ : బాలానగర్‌ మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి యువజన విభాగం మండల అధ్యక్షుడు, బీసీ సేన మహబూబ్‌నగర్‌ జిల్లా అధ్యక్షుడు ప్రకాష్‌ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్దాయపల్లి చౌరస్తాలో ఏర్పాటు చేసిన వేడుకలకు జాతీయ బీసీ సేన అధ్యక్షుడు బర్కా కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ప్రకాష్‌ను శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా బర్కా కృష్ణ మాట్లాడుతూ ప్రకాష్‌ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. జడ్చర్ల నియోజకవర్గంలోని భారత రాష్ట్ర సమితి నాయకులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.

కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ప్రకాష్‌ కేక్‌ కట్‌ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అనంతరం పలువురు నాయకులు ఆయనను శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన భారత రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తలు, బీసీ సేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.