Jagan | ఎయిర్పోర్ట్ నుంచి జైలు వద్దకు బయల్దేరిన జగన్..
Jagan | కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ నుంచి పంచలింగాల జిల్లా జైలు వైపు బయలుదేరారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించడానికి జగన్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక వాహనంలో ఆయన జిల్లా జైలు వద్దకు పయనమయ్యారు.

జగన్ రాక నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎయిర్పోర్ట్ నుంచి జిల్లా జైలు వరకు ప్రధాన మార్గాల్లో బందోబస్తు ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో స్థానికంగా రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. పంచలింగాల జిల్లా జైలు వద్దకు ఆయన ఎందుకు వెళ్తున్నారు, అక్కడ ఎవరిని కలవనున్నారు అనే అంశాలపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది.
