పలువురికి ఎమ్మెల్యే పరామర్శ…
అవనిగడ్డ, ఆంధ్రప్రభ : అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గురువారం పలువురిని పరామర్శించారు. అవనిగడ్డలో సీనియర్ నాయకులు, ప్రముఖులు చందన నరసింహారావు అనారోగ్యంతో బాధపడుతుండగా ఆయనను పరామర్శించారు. చికిత్స వివరాలు కుటుంబ సభ్యులు వివరించారు. ఇటీవల అవనిగడ్డలో ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో ద్విచక్ర వాహనం ఢీకొని గాయపడి చికిత్స అనంతరం ఇంటి వద్ధ కోలుకొంటున్న తుంగల శ్రీనివాసరావును పరామర్శించారు. ఆయన వెంట జనసేన సీనియర్ నాయకులు బచ్చు వెంకటనాధ్ ప్రసాద్, డీసీ వైస్ చైర్మన్ బచ్చు రఘునాథ ప్రసాద్, జనసేన పార్టీ మండల నాయకులు బచ్చు శ్రీహరి, కమ్మిలి సాయిభార్గవ తదితరులు ఉన్నారు.
