రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ఆంధ్రప్రభ, శేరిలింగంపల్లి: హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి పరిధి మదినగూడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందింది. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఆమె ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

అయితే ప్రమాదం జరిగిన అనంతరం మహిళ మృతదేహం సుమారు 35 నిమిషాల పాటు నడిరోడ్డుపైనే ఉండిపోవడం స్థానికుల్లో ఆగ్రహం రేకెత్తించింది. మృతదేహాన్ని వెంటనే తొలగించకపోవడంపై అధికారులు, సంబంధిత యంత్రాంగం తీరుపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ఒకవేళ బాధితురాలు ప్రాణాలతో ఉండి తీవ్ర గాయాలతో రోడ్డుపై పడి ఉంటే కూడా అధికారులు ఇదే విధంగా స్పందించేవారా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఘటనతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply