ప్రశాంతంగా పాలిసెట్ ప్రవేశ పరీక్ష

ప్రశాంతంగా పాలిసెట్ ప్రవేశ పరీక్ష

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (ఎస్బీటీఈటీ) ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన పాలిసెట్–2026 ప్రవేశ పరీక్ష మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, అలాగే కొమురం భీమ్ జిల్లాలోని ఆసిఫాబాద్ కోఆర్డినేటింగ్ కేంద్రాల పరిధిలో పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయని కోఆర్డినేటర్ డా. ఎం. దేవేందర్ తెలిపారు. బెల్లంపల్లి కోఆర్డినేటింగ్ కేంద్రం పరిధిలో 1,171 మందికి గాను 1,119 మంది (95.56%) హాజరు కాగా, మంచిర్యాల కేంద్రంలో 2,365 మందికి 2,206 మంది (93.28%), ఆసిఫాబాద్ కేంద్రంలో 1,064 మందికి 1,002 మంది (94.12%) విద్యార్థులు పరీక్ష రాశారని వివరించారు. పరీక్షల నిర్వహణను ప్రత్యేక అబ్జర్వర్ ఎ. కాంతయ్య పర్యవేక్షించగా, అసిస్టెంట్ కోఆర్డినేటర్ బి. వెంకటేశ్వర్లు, రూట్ ఆఫీసర్ డా. ఎస్. నాగరాజు, వివిధ కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు సమన్వయంతో విధులను నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, మెడికల్ క్యాంపులు, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Leave a Reply