కార్మికుల సమస్యలు తెలుసుకున్న మధుసూదనాచారి

కార్మికుల సమస్యలు తెలసుకున్న మధుసూదనాచారి

నీటి సమస్య పరిష్కారానికి జీఎంకు ఫోన్

కార్మికులతో మమేకమై మౌలిక సదుపాయాలపై ఆరా

భూపాలపల్లి, ఆంధ్రప్రభ ప్రతినిధి: శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి శుక్రవారం సింగరేణి కేటీకే–5 ఇంక్లైన్‌లో పర్యటించి కార్మికులతో మమేకమయ్యారు. గని పరిధిలోని క్యాంటీన్, డిస్పాచ్, మ్యాన్ రైడింగ్ తదితర విభాగాలను సందర్శిస్తూ కార్మికుల పనితీరు, సంక్షేమ పరిస్థితులను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కార్మికులతో ముఖాముఖి మాట్లాడిన ఆయన వారి సమస్యలపై ఆరా తీశారు. గనిలో తాగునీటి సమస్య నెలకొన్నట్లు కార్మికులు ఆయన దృష్టికి తీసుకురాగా, వెంటనే సింగరేణి జనరల్ మేనేజర్‌కు ఫోన్ చేసి ఎలాంటి జాప్యం లేకుండా సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. కార్మికులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.

అనంతరం భూపాలపల్లి పట్టణంలో మాజీ మంత్రి టి. హరీష్ రావు హాజరు కానున్న సింగరేణి కార్మిక సదస్సుకు పెద్ద ఎత్తున హాజరుకావాలని కార్మికులను ఆహ్వానించారు. కార్మికుల హక్కుల పరిరక్షణకు తమ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు దేవరకొండ మధు, ముద్దసాని కిరణ్, జరుపుల కిషన్, వనం అనిల్, అరిగె సుధాకర్, కృష్ణ, బుర్ర కొమురయ్య, పులి మధు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply