​షోరూమ్‌ల ఏర్పాటుతో స్థానికంగా ఉపాధి అవకాశాలు

  • ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి..

మేడ్చల్, ఆంధ్రప్రభ : మేడ్చల్ పట్టణ కేంద్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రముఖ అంతర్జాతీయ, జాతీయ బ్రాండ్లు ఇక్కడ తమ వ్యాపారాలను విస్తరించడం శుభపరిణామమని మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి అన్నారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలోని మేడ్చల్ పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రముఖ వ్యాపార సంస్థ ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన ‘ఓండ్’ (ownd) ఫ్యాషన్ షోరూమ్‌ను శుక్రవారం రోజు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి, రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ మేడ్చల్ నియోజకవర్గం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని, నూతన షోరూమ్‌ల ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి, ప్రజల అభిరుచులకు అనుగుణంగా ఒకే చోట అత్యాధునిక ఫ్యాషన్ డిజైన్లు, బ్రాండెడ్ వస్త్రాలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు.వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తూ ఈ షోరూమ్ మంచి విజయం సాధించాలని ఆయన యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, షోరూమ్ నిర్వాహకులు పట్టణ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.