వైద్య సహాయానికి అందిన చేయూత

భవానీపురం, ఆంధ్రప్రభ: మెరుగైన వైద్య చికిత్స కోసం మంజూరైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌ఓసీ)ను సోమవారం భవానీపురంలోని ఎన్డీఏ కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో మంజూరైన రూ.2.90 లక్షల ఎల్‌ఓసీని కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్లు, కూటమి నాయకులతో కలిసి అందించారు.

55వ డివిజన్ వించిపేటకు చెందిన దేవకుమార్ నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు మరింత మెరుగైన వైద్యం అవసరమని వైద్యులు సూచించడంతో కుటుంబ సభ్యులు ఎన్డీఏ కార్యాలయంలో ఎల్‌ఓసీ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

దరఖాస్తును పరిశీలించిన అనంతరం రూ.2.90 లక్షల ఆర్థిక సహాయాన్ని ఎల్‌ఓసీ రూపంలో మంజూరు చేశారు. ఈ మొత్తాన్ని బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేశారు.

త్వరితగతిన స్పందించి వైద్య సహాయం అందించడంపై బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మహ్మద్ అబ్దుల్ ఖాదర్, మహాదేవు అప్పాజీరావు, అత్తలూరి ఆదిలక్ష్మీ పెదబాబు, మరుపిళ్ల రాజేష్, టీడీపీ నాయకులు నాగోతి రామారావు, సయ్యద్ కరిముల్లా, జనసేన నాయకుడు ఏలూరు సాయి శరత్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు నాగలక్ష్మి, టీడీపీ మహిళా నాయకురాలు బంకా నాగమణి పాల్గొన్నారు.

Leave a Reply