Telangana |పటేల్ స్ఫూర్తి కోసం కృషి చేద్దాం

Telangana |పటేల్ స్ఫూర్తి కోసం కృషి చేద్దాం

గుజరాత్ ఎంపీ డాక్టర్ ఫార్మర్ యశ్వంత్ సింగ్ పిలుపు

నాగర్ కర్నూల్,  ఆంధ్ర ప్ర‌భ : భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన అనంతరం దేశంలో ఉన్న 560 కి పైగా స్వతంత్ర రాజ్యాలను తొలి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ సామంత రాజులను భారతదేశంలో విలీనం చేసి భారతదేశం ఐక్యతను పటిష్టపరిచారని, అదే స్ఫూర్తితో మనమంతా కూడా భారత దేశంలో ఏకతాను సాధించేందుకు కృషి చేద్దామని గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యులు డాక్టర్ ఫార్మర్ యశ్వంత్ సింగ్ యువతకు పిలుపునిచ్చారు. శనివారం మధ్యాహ్నం స్థానిక బిజెపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో, అనంతరం భారతదేశ ఐక్యతను చాటి చెప్పిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్(Sardar Vallabhai patel) 150వ జయంతి ఉత్సవాలను యావత్ భారత దేశంలో సంవత్సరం పొడవునా నిర్వహించాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయించి అక్టోబర్ 26న ప్రారంభించారని తెలిపారు.

నేటి యువతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశం ఐక్యతను చాటి చెప్పేందుకు చేసిన కృషిని వివరించేందుకే సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలను భారత యువజన క్రీడామంత్రిత్త్వశాఖ ద్వారా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయన స్ఫూర్తితో నేటి యువత భారత ఐక్యతను కొనసాగిస్తూ 2047 నాటికి ప్రపంచంలోనే భారత్ ఆర్థిక సంపన్న దేశంగా తీర్చిదిద్దేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని అందులో మనమంతా కూడా భాగస్వాములై ఐక్య భారతదేశం ఆత్మ నిర్భర దీక్షిత్ భారత్ గా మార్చేందుకు మనందరి బాధ్యత అని పిలుపునిచ్చారు. బిజెపి జిల్లా అధ్యక్షులు వేముల నరేందర్ రావు(Vemula Narendar Rao) మాట్లాడుతూ అభివృద్ధికే బీహార్ ప్రజలు పట్టం కట్టారని, వారసత్వ రాజకీయాలకు, జంగిల్ రాజ్యానికి తాము వ్యతిరేకమని అభివృద్ధికి మద్దతిస్తామంటూ తీర్పు ఇచ్చారని, ఇకమీదట రాబోయే ఏ ఎన్నికల్లో కూడా ప్రజలు ఇదే తీర్పును ఇస్తారనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ చేపట్టిన అభివృద్ధి ఫలాలు నాగర్కర్నూల్ జిల్లాలో కూడా కొనసాగుతున్నాయని వివరించారు.

జిల్లాలో కొనసాగుతున్న జాతీయ రహదారులైన 167కే, జడ్చర్ల కోదాడ తదితర అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, మన్ననూర్ శ్రీశైలం కారిడార్ జాతీయ రహదారి పనులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చి నిధులు మంజూరు చేసిందని త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. డోర్నకల్ గద్వాల రైల్వే లైన్ సర్వే తుది దశకు వచ్చిందని త్వరలోనే ఇట్టి పనులకు కూడా కేంద్ర ప్రభుత్వం(Central Govt) అనుమతి ఇచ్చి నిధులు మంజూరు చేస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో వ్యవసాయం తోపాటు అనుబంధ రంగాలను అభివృద్ధిపరిచి రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధానమంత్రి దన్,ధాన్య కృషి యోజన పథకం అమలు కోసం ఉమ్మడి జిల్లాలోని నాగర్ కర్నూల్ గద్వాల నారాయణపేట జిల్లాలను ఎంపిక చేసిందని జిల్లాలో ప్రతి సంవత్సరం 240 కోట్లు చొప్పున నిధులు ఖర్చు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే ఈ పథకం అమలు కోసం జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టిందని ఇట్టి పనులను పర్యవేక్షించి, రైతులకు ప్రభుత్వ ఫలాలు అందించే కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాకు కేంద్ర ప్రభుత్వ స్థాయి ఐఏఎస్ అధికారిని నోడల్ అధికారిగా నియమించి పర్యవేక్షించే బాధ్యతను అప్పగించారని తెలిపారు. రాబోయే రోజుల్లో పశ్చిమబెంగాల్ తెలంగాణ రాష్ట్రాలలో బిజెపి అధికారంలోకి వచ్చే విధంగా సంస్థగతంగా బలోపేతం చేసేందుకు జాతీయ నాయకత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పంజగుల నాగేంద్రం గౌడ్, నాయకులు పోల్ దాస్ రాము, ప్రమోద్ కుమార్ , చందు, పదిర భీమేష్ , సూరంపల్లి సుధాకర్  కొమ్ముల సత్యనారాయణ ,వెంకటేష్ ,శివ, సూరిబాబు, బాలస్వామి, అలా రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply