జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో ముందుకు సాగాలి..

హసన్ పర్తి, ఆంధ్రప్రభ ; అణగారిన వర్గాల కోసం నిరంతరంగా పోరాటం సల్ఫిన బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని నాగారం సర్పంచ్ సందరాజు లావణ్య సంతోష్ కోరారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి బాబు జగజీవన్ రావు 118వ జయంతిని పురస్కరించుకొని హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం నాగారంలో సర్పంచ్ తో పాటు పలువురు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

సందర్భంగా సర్పంచ్ తో పాటు మండల కాంగ్రెస్ అధ్యక్షులు పోరెడ్డి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ఆయన అందించిన సేవలు చాలా గొప్పవని కొనియాడారు.అణగారిన వర్గాల కోసం నిరంతరంగా పోరాడిన వీరుడని అన్నారు. హక్కుల కోసం ఆయన జీవితాంతం సాగించిన పోరాటం ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో మైనార్టీ సెల్ అధ్యక్షులు అన్వర్, పంచాయితీ సభ్యులు బూర్ణ సాయి,చేలువరు విజయ,పో రెడ్డి సునీత రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చేలువేర్ అశోక్, కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంచార్జి తోట రమేష్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply